Share News

రిటైర్డ్‌ ఎయిర్‌మార్షల్‌కు అయోధ్య పగ్గాలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:43 AM

అయోధ్య రామాలయం మొట్టమొదటి సీఈవోగా రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్రమిశ్రా నియమితులయ్యారు. ఆలయ సీఈవో పోస్టు కోసం 5,585 మంది పోటీపడ్డారు...

రిటైర్డ్‌ ఎయిర్‌మార్షల్‌కు అయోధ్య పగ్గాలు

  • సీఈవోగా జితేంద్రమిశ్రా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో కీలక సేవలు

  • సీఈవో పోస్టుకు 5,585 మంది మేధావుల పోటీ

  • ఇంటర్వ్యూలకు ముగ్గురు ఎంపిక.. మిశ్రాకు చాన్స్‌

  • రామజన్మభూమి ట్రస్టుకు మరో ముగ్గురు సభ్యులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: అయోధ్య రామాలయం మొట్టమొదటి సీఈవోగా రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్రమిశ్రా నియమితులయ్యారు. ఆలయ సీఈవో పోస్టు కోసం 5,585 మంది పోటీపడ్డారు. సంస్థాగత నాయకత్వ లక్షణాలు, నిజాయితీ, నిర్వహణ నైపుణ్యం ఇలా.. అనేక అంశాలను పరిశీలించి అనేక వడపోతల తర్వాత ముగ్గురిని ఇంటర్వ్యూ చేసి జితేంద్ర మిశ్రాను సీఈవోగా ఎంపికచేశారు. విరాళాల చోరీ తర్వాత ఆలయ ప్రతిష్ఠను ఇనుమడింపచేసే అధికారి అవసరమైన నేపథ్యంలో జితేంద్రను ఎంపిక చేయడం విశేషం. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌కు ‘ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌’గా జితేంద్రసింగ్‌ కీలక సేవలందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఆయన రిటైరయ్యారు. తాను సీఈవో కావడంపై జితేంద్ర స్పందిస్తూ..‘‘ఇది దేవుడి ఆదేశం’’ అన్నారు. మరోవైపు, రామజన్మభూమి ట్రస్టుకు కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించారు. వీరిలో అయోధ్యకు చెందిన మదన్‌ మోహన్‌, ఢిల్లీకి చెందిన మహేశ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిర్మల యాదవ్‌ ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 05:43 AM