Share News

గణతంత్ర దినోత్సవం 2026.. భారతీయుల జీవితాలపై డిజిటల్ యాప్స్ ప్రభావం..

ABN , Publish Date - Jan 25 , 2026 | 06:01 PM

ఆదివారం (జనవరి 26) భారత దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాజ్యాంగాన్ని ఆమోదించి, తనను తాను గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నప్పటి నుంచి దేశం చాలా దూరం ప్రయాణించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి సగర్వంగా ముందుకు వెళ్తోంది.

గణతంత్ర దినోత్సవం 2026.. భారతీయుల జీవితాలపై డిజిటల్ యాప్స్ ప్రభావం..
, Digital India apps

ఆదివారం (జనవరి 26) భారత దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాజ్యాంగాన్ని ఆమోదించి, తనను తాను గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నప్పటి నుంచి దేశం చాలా దూరం ప్రయాణించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి సగర్వంగా ముందుకు వెళ్తోంది. స్వేచ్ఛ, సమానత్వంను ప్రధానంగా చేసుకుని పౌరుల జీవితాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతోంది (Republic Day 2026 India).

గత పది సంవత్సరాలలో దేశం డిజిటల్‌గా ఎంతో అభివృద్ధి చెందింది. చాలా తక్కువ కాలంలోనే నగదు ఆధారిత లావాదేవీల నుంచి డిజిటల్ చెల్లింపులకు మారిపోయింది. అంతేకాదు డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందుతోంది. ఈ నేపథ్యంలో సాంకేతికత పరంగా భారత దేశం ఇటీవలి కాలంలో సాధించిన విప్లవాత్మక విజయాలేంటో తరచి చూద్దాం (Digital India apps)..


యూపీఐ చెల్లింపు..

గతంలో, ప్రజలు ఏటీఎమ్‌లపై ఎక్కువగా ఆధారపడేవారు. చాలా లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి. స్వదేశీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతీయుల చెల్లింపు విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. యూపీఐ చెల్లింపు వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండడంతో కొన్ని కోట్ల మంది చాలా తక్కువ కాలంలో దీనిని అనుసరించారు. ఈ మార్పు జీవన సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. ఆర్థిక పారదర్శకతను పెంచింది.

upi.jpg


సంక్షేమ పథకాల కోసం ఆధార్..

స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం సంక్షేమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది. అయితే, ప్రభుత్వానికి, లబ్ధిదారులకు మధ్య అవినీతి ఒక అవరోధంగా నిలిచింది. ఈ అవినీతికి ఆధార్ వ్యవస్థ కొంత మేరకు చెక్ పెట్టగలిగింది. నిజమైన లబ్ధిదారులను ధృవీకరించడానికి, ప్రభుత్వ పథకాలలో అవినీతిని తగ్గించడానికి సహాయపడింది. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించడంతో, ప్రభుత్వ ప్రయోజనాలు ఇప్పుడు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి (Aadhaar services India).

ఆధార్-పాన్ అనుసంధానం..

భారత ప్రభుత్వం ఆధార్ కార్డు, పాన్ కార్డును అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం వెనుక పన్ను వ్యవస్థను పారదర్శకంగా మార్చడం, నకిలీ లావాదేవీలకు అడ్డుకట్ట వేయడం వంటి ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. ఆధార్–పాన్ లింక్ చేయడం వల్ల సాధారణ పౌరుడికి కూడా అనేక లాభాలు కలుగుతాయి. ఆధార్–పాన్ అనుసంధానం వల్ల ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుంది. బ్యాంకింగ్, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు వంటి అనేక సేవల్లో ఆధార్–పాన్ అనుసంధానం ఉపయోగపడుతుంది.


డిజిలాకర్.. ప్రతి పౌరుడికి క్లౌడ్ స్టోరేజ్

సాధారణ పౌరుడికి క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిలాకర్ ద్వారా, భారతీయులు తమ ముఖ్యమైన ప్రభుత్వ పత్రాలను పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో సురక్షితంగా దాచుకోవచ్చు. ప్రభుత్వం ధృవీకరించిన పత్రాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, డిజిటల్ ఫార్మాట్‌లో యాక్సెస్ చేయవచ్చు (DigiLocker documents).

digilocker.jpg


ఉమాంగ్: అన్ని ప్రభుత్వ సేవలకు ఒకే యాప్

బహుళ ప్రభుత్వ సేవలు, యాప్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి, ప్రభుత్వం ఉమాంగ్ అనే సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అందించే విస్తృత శ్రేణి సేవలను ఒకే చోట నుంచి యాక్సెస్ చేయవచ్చు (UMANG citizen service).

డిజిటల్ ఇండియా.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి

భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో.. దేశ డిజిటల్ ప్రయాణం (India digital revolution) రాజ్యాంగం నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. పౌరులకు సాధికారత కల్పించడం, పారదర్శకతను పెంచడం, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం డిజిటల్ ఇండియా లక్ష్యాలు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న ముగ్గురిని 10 సెకెన్లలో కనిపెట్టండి..


వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..

Updated Date - Jan 25 , 2026 | 06:01 PM