మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. అభ్యర్థిత్వం ఉపసంహరించుకున్న రబియుల్..
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:17 PM
పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నికలో టీఎంసీ తరఫు నుంచి బరిలోకి దిగిన సంచిత పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నికలో టీఎంసీ తరఫు నుంచి బరిలోకి దిగిన సంచిత పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రెజీనగర్ నుంచి పోటీ చేయాల్సిన రబియుల్ ఆలం చౌదరి కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు (Rejinagar bypoll 2026).
రెజీనగర్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ వర్గం తరఫున రబియుల్ ఆలం చౌదరిని సెప్టెంబర్ 13న అభ్యర్థిగా ప్రకటించారు. నందిగ్రామ్, రెజీనగర్ రెండు నియోజకవర్గాలకు అక్టోబర్ 6న పోలింగ్ జరగనుంది. ఆ ఎన్నికలకు ముందే టీఎంసీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఎన్నికల గుర్తుకు సంబంధించిన వివాదం కారణంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆలం రబియుల్ పేర్కొన్నారు. కొత్త ఎన్నికల గుర్తును ఓటర్లకు పరిచయం చేయడానికి సమయం తక్కువగా ఉందని, పార్టీ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో సమర్థంగా సమీకరించడానికి కూడా తగిన సమయం లేదని ఆయన పేర్కొన్నారు (TMC Rabiul Alam Chowdhury).
ప్రస్తుతం మమతా బెనర్జీ వర్గంతో పాటు రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం మధ్య తృణమూల్ కాంగ్రెస్ పేరు, గుర్తు కోసం వివాదం నెలకొంది (West Bengal bypoll). ఈ వివాదంపై ఎన్నికల సంఘం విచారణ కొనసాగిస్తోంది. రెజీనగర్ పరిణామానికి ముందు నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి సంచిత కూడా ఉప ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో మమత వర్గం ప్రకటించిన ఇద్దరూ అసెంబ్లీ అభ్యర్థులూ పోటీ నుంచి వైదొలిగినట్టైంది.
ఇవి కూడా చదవండి..
బిల్లుపై సంతకం పెట్టిన ట్రంప్.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు మార్గం సుగమం..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..