Share News

ఆంక్షలు ఎత్తేసిన అమెరికా.. ఇరాన్ ముడి చమురుపై భారత రిఫైనరీల దృష్టి..

ABN , Publish Date - Mar 21 , 2026 | 06:13 PM

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యా ముడిచమురుపై అమెరికా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై కూడా ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

ఆంక్షలు ఎత్తేసిన అమెరికా.. ఇరాన్ ముడి చమురుపై భారత రిఫైనరీల దృష్టి..
India Iran oil

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యా ముడి చమురుపై అమెరికా ఇప్పటికే సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై కూడా ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ చమురును భారత్ సహా ఇతర ఆసియా దేశాల రిఫైనరీలు కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది (India Iran oil).


ఇరాన్‌కు చెందిన 170 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, యుద్ధం ప్రారంభమయ్యే నాటికి సముద్రంలో ఉంది. యుద్ధం మొదలు కావడంతో అది సముద్రంలోనే నిలిచిపోయింది. ఈ చమురును సరఫరాలోకి తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఉపశమన చర్యలు ప్రారంభించింది. మార్చి 20 లేదా అంతకు ముందు నౌకల్లోకి లోడ్ చేసి, ఏప్రిల్ 19 నాటికి డిశ్చార్జ్ కావాల్సిన ముడి చమురుకు 30 రోజుల సడలింపు ఇస్తున్నట్టు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి బెసెంట్ ఓ ప్రకటన చేశారు. ఆ ముడి చమురుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు, చెల్లింపుల విషయంలో అమెరికా నుంచి స్పష్టత కోసం ఆసియా దేశాలకు చెందిన పలు రిఫైనరీలు వేచి చూస్తున్నట్టు సమాచారం (US sanctions waiver Iran).


రష్యాకు చెందిన 130 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసేందుకు కూడా అమెరికా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే (crude oil imports India). రష్యా ముడిచమురుతో పాటు తాజాగా ఇరాన్ ముడి చమురు కూడా మార్కెట్‌లోకి వస్తే ఇంధన సంక్షోభం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా, తమ వద్ద ముడి చమురు నిల్వలు లేవని ఇరాన్ ప్రకటించడం గమనార్హం.


ఇవి కూడా చదవండి..

వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..


మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ పూల మధ్యలో గంట ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..

Updated Date - Mar 21 , 2026 | 06:16 PM