చిన్నప్పుడే చక్కెర తగ్గిస్తే.. భవిష్యత్తులో క్యాన్సర్ దూరం!
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:57 AM
గర్భం దాల్చినప్పటి నుంచి శిశువుకు రెండేళ్లు (1000 రోజులు) నిండేవరకు చక్కెర వాడకాన్ని నియంత్రించడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 36 శాతం నుంచి 69 శాతం వరకు తగ్గుతుందని, వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
తాజా అధ్యయనం వెల్లడి
చెన్నై, నవంబరు 27: గర్భం దాల్చినప్పటి నుంచి శిశువుకు రెండేళ్లు (1000 రోజులు) నిండేవరకు చక్కెర వాడకాన్ని నియంత్రించడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 36 శాతం నుంచి 69 శాతం వరకు తగ్గుతుందని, వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్ ఆధారిత ఈ అధ్యయన వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్లో చక్కెర రేషన్ విధానం అమలులో ఉన్న కాలంలో యూకే బయోబ్యాంక్లో ఉన్న 64,761 మంది ఆరోగ్య డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఆ కాలంలో తమ మొదటి 1000 రోజులు అక్కడ గడిపిన వ్యక్తుల్లో వారికి.. తర్వాతి జీవితంలో కాలేయం, కాలేయంలోని పైత్యరస నాళం, పురీషనాళం, ప్రొస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గినట్టుగుర్తించారు. చిన్నతనంలో తక్కువ చక్కెర తీసుకున్న వారి కణజాలంలో క్రోమోజోమ్ల చివర ఉండే ‘టెలోమీటర్లు’ పొడవుగా ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల వారి జీవసంబంధమైన వయస్సు 2.2 సంవత్సరాలు తక్కువగా ఉన్నట్టు తేల్చారు.బాల్యంలో చక్కెర తక్కువగా తీసుకున్నవారు ఐదు దశాబ్దాల తర్వాత కూడా ఆరోగ్యకర అలవాట్లను కొనసాగించారని పరిశోధకులు గుర్తించారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..