Share News

ఎర్రకోట సందర్శనకు ఇక అన్నిరోజులూ అనుమతి

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:46 AM

దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట ఇకపై వారంలో అన్ని రోజులు సందర్శకుల కోసం అందుబాటులో ఉండనుంది. సోమవారం...

ఎర్రకోట సందర్శనకు ఇక అన్నిరోజులూ అనుమతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట ఇకపై వారంలో అన్ని రోజులు సందర్శకుల కోసం అందుబాటులో ఉండనుంది. సోమవారం రోజున ఎర్రకోటను మూసివేసే పద్ధతిని రద్దు చేసినట్లు భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎ్‌సఐ) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఏఎ్‌సఐ డైరెక్టర్‌ జనరల్‌ ఫిబ్రవరి 13న జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటికే అమలులోకి వచ్చాయని, ఫిబ్రవరి 16న (సోమవారం) ఎర్రకోటను సందర్శకుల కోసం తెరిచే ఉంచామని తెలిపారు. ఈ నిర్ణయంతో దేశీయ, విదేశీ పర్యాటకులకు మరింత సౌకర్యం కలుగనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 05:46 AM