కంగనకు స్వీట్లు పంపిన రామ్‌దేవ్..
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:04 AM
నటి, ఎంపీ కంగనా రనౌత్.. బాబా రామ్‌దేవ్ మధ్య గొడవలు, మాటల యుద్ధం ముగిసింది! రాఖీ పండుగ సందర్భంగా బాబా రామ్‌దేవే చొరవ చూపి గొడవకు ముగింపు పలికారు....
అన్నయ్య ప్రేమను స్వీకరిస్తున్నానన్న కంగన
న్యూఢిల్లీ, ఆగస్టు 28: నటి, ఎంపీ కంగనా రనౌత్.. బాబా రామ్‌దేవ్ మధ్య గొడవలు, మాటల యుద్ధం ముగిసింది! రాఖీ పండుగ సందర్భంగా బాబా రామ్‌దేవే చొరవ చూపి గొడవకు ముగింపు పలికారు. ఢిల్లీలో నిరసనలు చేపట్టిన జన్‌జీని యువతను ఉద్దేశించి జనరేషన్ గట్టర్ అంటూ కంగన తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని రామ్‌దేవ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం హరిద్వార్‌లో బాబా రామ్‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. కంగనను తాను సోదరిగా భావిస్తున్నానని.. ఆమెకు రాఖీ పండుగ సందర్భంగా స్వీట్లు, కానుకలను పోస్టు ద్వారా పంపుతున్నట్లు పేర్కొన్నారు. బాబా రామ్‌దేవ్ చొరవకు అటు కంగన సానుకూలంగా స్పందించారు. ‘‘పండుగ రోజు అంటే తప్పొప్పులను క్షమించి మరిచిపోయేరోజు. వివాదం వద్దు.. చర్చే ముద్దు అంటూ మా అన్నయ్య రామ్‌దేవ్ మంచి మాట చెప్పారు. అన్నయ్య ప్రేమను నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు