Share News

కులతత్వాన్ని రద్దు చేస్తే రిజర్వేషన్లు వదిలేస్తాం

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:54 AM

కులతత్వాన్ని రద్దు చేస్తే తాము రిజర్వేషన్లను వదులుకుంటామని కేంద్ర మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు...

కులతత్వాన్ని రద్దు చేస్తే రిజర్వేషన్లు వదిలేస్తాం

కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలె

రాయ్‌పూర్‌, సెప్టెంబరు 9: కులతత్వాన్ని రద్దు చేస్తే తాము రిజర్వేషన్లను వదులుకుంటామని కేంద్ర మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రాందాస్‌ అఠావలెస్పష్టం చేశారు. రిజర్వేషన్లను వ్యతిరేకించడం సరికాదని, రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. వాస్తవానికి వెనుకబడిన వర్గాలను బలోపేతం చేసేందుకే రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. అంటరానితనాన్ని గతంలోనే నిషేధించినా దళితులు, గిరిజనులపై ఇప్పటికీ దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నవరాత్రుల సందర్భంగా జరిగే గార్భా నృత్యాలకు ముస్లింలను అనుమతించరాదంటూ విశ్వహిందూపరిషత్‌ పిలుపునివ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. రాజ్యాంగం ప్రకారం ఏ మత వేడుకల్లోనైనా భారతీయులందరూ పాల్గొనవచ్చని అఠావలె చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 05:54 AM