Share News

రామజన్మ ట్రస్టు సీఈవో పదవికి దరఖాస్తులు

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:44 AM

రామాలయానికి వచ్చిన విరాళాలను దొంగతనం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆలయ పాలన, ఆర్థిక నిర్వహణను...

రామజన్మ ట్రస్టు సీఈవో పదవికి దరఖాస్తులు

అయోధ్య, జూలై 13: రామాలయానికి వచ్చిన విరాళాలను దొంగతనం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆలయ పాలన, ఆర్థిక నిర్వహణను కట్టుదిట్టం చేయడానికి శ్రీరామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తొలి ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో) నియామకం కోసం ట్రస్టు సోమవారం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తులు పంపాలని నోటిఫికేషన్‌లో కోరింది. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు అప్లికేషన్లను స్వీకరిస్తామని ట్రస్టు ‘ఎక్స్‌’లో పేర్కొంది. ‘ఈ పదవి మూడేళ్లు ఉంటుంది. పనితీరుపై సంతృప్తి చెందితే పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. డిగ్రీ పూర్తి చేసి 50-70 ఏళ్లలోపువారు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. భారీ ప్రజాసంస్థ, ప్రభుత్వ శాఖ లేదా కంపెనీలో కనీసం 20ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. పరిపాలన, ఆర్థికం, అకౌంట్స్‌, మానవ వనరులు, న్యాయవ్యవహారాల్లో అనుభవం ఉండాలి. సీఏవోగా పనిచేసిన వారికి, ఏదైనా హిందూ మత సంస్థ నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుదారులు హిందూమతావలంబకులై ఉండాలి. వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీరామభక్తుడై ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్రస్టు పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 05:44 AM