‘యాజమాన్య’ వివాదంలో రవివర్మ ఆఖరి పెయింటింగ్
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:02 AM
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ ‘ఆఖరి’గా వేసిన పెయింటింగ్‌గా భావిస్తున్న చిత్రం.. యాజమాన్య వివాదంలో చిక్కుకుంది. 19వ శతాబ్దానికి చెందిన రవివర్మ వేసిన...
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ ‘ఆఖరి’గా వేసిన పెయింటింగ్‌గా భావిస్తున్న చిత్రం.. యాజమాన్య వివాదంలో చిక్కుకుంది. 19వ శతాబ్దానికి చెందిన రవివర్మ వేసిన ‘కాదంబరి’ పెయింటింగ్ ప్రస్తుతం కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అధీనంలో ఉంది. తాము ఒక ప్రైవేట్ మ్యూజియంగా ఆ కళాఖండాన్ని కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉంచుతామని, దాన్ని ఇకపై విక్రయుంచబోమని కిరణ్ నాడార్ మ్యూజియం ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. రూ.100 కోట్లకు విలువైనదిగా భావిస్తున్న ఈ కళాఖండం మొదట.. మోహిందర్ వర్మ అనే ఢిల్లీకి చెందిన ఒక కళాఖండాల సేకరణదారుడి వద్ద ఉండేది. అయితే దాన్ని అప్పగించిన తర్వాత తన సహచరులు తనను మోసగించారని పేర్కొంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వారు ఆ పెయింటింగ్‌ను తన అనుమతి లేకుండా మధ్యవర్తుల ద్వారా విక్రయించేశారని దావాలో తెలిపారు. ఆ తర్వాత సఫ్రాన్ ఆర్ట్ అనే సంస్థ రవివర్మ పెయింటింగ్‌ను వేలం వేసిందని, దాన్ని కొంత మొత్తానికి కిరణ్ నాడార్ మ్యూజియం కొనుగోలు చేసిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News