Share News

దోపిడీ యంత్రాంగంగా విద్యా వ్యవస్థ

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:07 AM

దేశ విద్యా వ్యవస్థ మోసపూరిత దోపిడీ యంత్రాంగంగా మారిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు...

దోపిడీ యంత్రాంగంగా విద్యా వ్యవస్థ

విప్లవాత్మక మార్పులకు ఇదే సమయం: రాహుల్‌

న్యూఢిల్లీ, జూలై 13: దేశ విద్యా వ్యవస్థ మోసపూరిత దోపిడీ యంత్రాంగంగా మారిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మౌనం వహించి జవాబుదారీతనం నుంచి తప్పుకొన్నారని దుయ్యబట్టారు. ‘అవినీతి, అన్యాయం, పక్షపాతం, నిజాయితీ లోపించడం.. ఈ నాలుగు పదాలు నేను చెబుతున్నవి కాదు.. దేశంలోని విద్యార్థులు మన విద్యా వ్యవస్థను ఉద్దేశించి వాడుతున్న పదాలు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ చేపట్టిన ‘ఛత్రోన్‌ కీ గూంజ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న డెహ్రాడూన్‌లో తలపెట్టిన ర్యాలీకి భారీగా తరలిరావాలన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 06:07 AM