ఓటరు కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలా: రాహుల్
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:39 AM
ఆధార్‌కు బదులు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి ఓటరు గుర్తింపు కార్డులను వినియోగిస్తామన్న కేంద్రం ప్రకటనపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
న్యూఢిల్లీ, నవంబరు 6: ఆధార్‌కు బదులు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి ఓటరు గుర్తింపు కార్డులను వినియోగిస్తామన్న కేంద్రం ప్రకటనపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘ఇది ఓటు చోరీ మాత్రమే కాదు పౌరుల హక్కుల చోరీ కూడా’ అని అన్నారు. ఆధార్‌కు బదులు ఓటరు కార్డుతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తిస్తామన్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటన వెనుక ‘కుట్ర’ దాగి ఉందన్నారు. కాగా, దీపావళి సందర్భంగా పార్టీ నేతలకు రాహుల్ గాంధీ శుక్రవారం తన నివాసంలో తేనీటి విందునిచ్చారు. ఈ విందు సమావేశంలో ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఇదిలా ఉండగా, ‘సర్’పై బహిరంగ చర్చకు రావాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి సవాలు విసిరారు. ఈ విషయంలో ప్రధానిని తికమకపెట్టకుండా ఆయనను చర్చకు ఒప్పించాలని హోం మంత్రి అమిత్ షాకు సూచించారు. ‘ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నా. డరో మత్’ అంటూ హిందీలో ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.