Share News

'సర్‌'పై రాహుల్ గాంధీని నిలదీసిన డీఎంకే నేత రవణన్ అన్నాదురై..

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:19 PM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డీఎంకే నేత రవణన్ అన్నాదురై సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని, తమిళనాడులో ఓటర్ల తొలగింపులపై రాహుల్ గాంధీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

'సర్‌'పై రాహుల్ గాంధీని నిలదీసిన డీఎంకే నేత రవణన్ అన్నాదురై..
SIR

చెన్నై: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డీఎంకే నేత రవణన్ అన్నాదురై సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని, అయితే తమిళనాడులో ఓటర్ల తొలగింపులపై రాహుల్ గాంధీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాహుల్‌పై సరవణన్ ప్రశ్నల వర్షం కురిపించారు.


అంతేకాకుండా సర్‌ తర్వాత ఎన్నికైన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఎందుకు సమర్థించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడులో సర్‌పై మాట్లాడటానికి ఆయన నటుడు విజయ్‌కి భయపడుతున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే నేత సరవణన్ అన్నాదురై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.


కాగా, తమిళనాడు ఎన్నికల తర్వాత ఇండియా కూటమి నుంచి డీఎంకే వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇటీవల సర్‌కు వ్యతిరేకంగా వ్యూహం రూపొందించేందుకు జరిగిన కూటమి సమావేశానికీ ఆ పార్టీ హాజరు కాలేదు. అయితే సర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్ గాంధీపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

జ్ఞానేశ్ బ్రో అంతా అయిపోయింది.. రాజీనామా సమయం వచ్చింది: రాహుల్ గాంధీ

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

Updated Date - Oct 06 , 2026 | 07:30 PM