Share News

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:25 PM

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
Rahul Gandhi

న్యూఢిల్లీ, జులై 29: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. విద్యార్థులపై దాడులకు అమిత్‌ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేకులున్న లాఠీలతో విద్యార్థులను కొట్టారని రాహుల్‌ ఆరోపించారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.


రాహుల్ మాట్లాడుతూ.. ‘దేశానికి ఉపయోగపడే అంశాలపై మాట్లాడటం నా హక్కు. లోక్‌సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. పెల్లెట్‌ గన్‌ తగిలి ఒక యువకుడికి కన్ను పోయింది. ఆందోళన చేస్తున్నవారిని ముళ్ల లాఠీలతో కొట్టారు. ఢిల్లీ వీధుల్లో విద్యార్థులను దారుణంగా కొట్టారు’ అని రాహుల్‌ అన్నారు.


పార్లమెంట్‌లో అసలేం జరిగింది?

ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపించారు. ఆయనే ఈ కాల్పులకు ఆర్డర్ ఇచ్చి ఉంటారని, అందుకే భయపడి సభకు రాలేదని అన్నారు. రాహుల్ గాంధీ నేరుగా హోంమంత్రిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని, సభకు క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 29 , 2026 | 07:11 PM