Share News

రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Aug 17 , 2026 | 01:50 PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Rahul Gandhi assets case

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న విచారణను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో సీబీఐ, ఈడీ ఎలాంటి నివేదికను ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు సమర్పించకూడదని స్పష్టం చేసింది (Rahul Gandhi assets case).


రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారించింది. అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 20న చేపట్టనుంది. అయితే హైకోర్టు విచారణను తదుపరి ఆదేశాల వరకు వాయిదా వేయాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమ దర్యాప్తు లేదా పరిశీలనకు సంబంధించిన ఎలాంటి నివేదికను హైకోర్టుకు సమర్పించకుండదని పేర్కొంది (Supreme Court Rahul Gandhi).


రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు వెళ్లింది (Disproportionate assets case). రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలను పరిశీలించాలని సీబీఐ, ఈడీకి హైకోర్టు గతంలో సూచించింది. ఈ ఆదేశాలను రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అంతేకాకుండా ఈ కేసు విచారణను అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలు చేశారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..


బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 17 , 2026 | 01:52 PM