యూజీసీ నెట్ పేపర్ కూడా లీక్: రాహుల్
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:35 AM
నీట్‌లాగే యూజీసీ నెట్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. సోషియాలజీ పరీక్షకు సంబంధించిన...
న్యూఢిల్లీ, జూలై 8: నీట్‌లాగే యూజీసీ నెట్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. సోషియాలజీ పరీక్షకు సంబంధించిన దాదాపు 90 ప్రశ్నలున్న ఓ పీడీఎఫ్ లీకయిందని ఆయన ఆరోపించారు. యూజీసీ నెట్‌ను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆ పరీక్ష నిర్వహణలో ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రశ్నపత్రాల్లో రిపీటెడ్ క్వశ్చన్స్, అక్షరదోషాలు ఉన్నాయని, ప్రశ్నల హిందీ అనువాదం గందరగోళంగా ఉందని పరీక్ష రాసిన కొందరు ఎన్‌టీఏపై మండిపడ్డారు. ఇప్పుడు పేపర్ లీక్ ఆరోపణలు కూడా రావడంతో యూజీసీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలతో నిండిన 100 పేజీల పీడీఎఫ్ లీకయిందని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే ఈ పీడీఎ్‌ఫను అక్షరాల రెండు లక్షల పాతిక వేల రూపాయలకు కొందరికి విక్రయించినట్టు ఆయన ఆరోపించారు. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో దీని విక్రయం జరిగినట్టు వివరించారు. ఈ ప్రశ్నపత్రాలు లీక్ చేసినవారికి భవిష్యత్తులో జరిగే సీఎ్‌సఐఆర్-నెట్, హెచ్‌టెట్ ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులోనే ఉంటాయని మరో ఆరోపణ చేశారు.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్