Share News

అదానీ కోసమే గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టు

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:34 AM

‘గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టు రక్షణ అవసరాల కోసం, ట్రాన్స్‌షి్‌పమెంట్‌ పోర్టు కోసం అని బీజేపీ చెపుతున్నది ఒక పెద్ద అబద్ధం. ఓ వ్యాపారస్థుడి ప్రయోజనాల కోసం చేస్తున్న పర్యావరణ విధ్వంసం..

అదానీ కోసమే గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టు

  • ‘రక్షణ’ కోసం అన్నది బీజేపీ అల్లుతున్న కథ: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, జూన్‌ 5: ‘గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టు రక్షణ అవసరాల కోసం, ట్రాన్స్‌షి్‌పమెంట్‌ పోర్టు కోసం అని బీజేపీ చెపుతున్నది ఒక పెద్ద అబద్ధం. ఓ వ్యాపారస్థుడి ప్రయోజనాల కోసం చేస్తున్న పర్యావరణ విధ్వంసం ఇది’ అని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. వాటికి వీడియో, ఒక పిటిషన్‌ జత చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారతీయ యువత ఉద్యమించాలని, ఆ పిటిషన్‌పై సంతకాలు చేయాలని పిలుపునిచ్చారు. ‘‘మోదీ ప్రభుత్వం గ్రేటర్‌ నికోబార్‌ ద్వీపాన్ని ధ్వంసం చేస్తోంది. ఒక వ్యాపారస్థుడికి లాభం చేకూర్చడం కోసం ఒక్కోటి రూ.3 లక్షలు ఖరీదు చేసే 1.5 కోట్లకుపైగాభారీ వృక్షాలను కూల్చేస్తోంది’’ అని రాహుల్‌ ఆరోపించారు. రాహుల్‌ ఆరోపణలను బీజేపీ తిప్పి కొట్టింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ..‘కేవలం గిరిజన ప్రాంతాలు ఉన్నాయన్న కారణంతో భవిష్యత్తును నిర్దేశించే మౌలిక సదుపాయాల నిర్మాణాలను ఆపలేం. అలాచేస్తే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు సహా ఏమీ నిర్మించలేం. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన అనుమతులకు లోబడమే ప్రాజెక్టు ఉంది. కొంత మంది ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను అర్థం చేసుకోలేరు’ అంటూ ఎద్దేవా చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 05:34 AM