అబద్ధాల గురువు మోదీ
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:27 AM
ప్రధాని నరేంద్రమోదీ ‘అబద్ధాలకు గురువు’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతి...
అమెరికా ఒప్పందంతో రైతులు, జౌళి పరిశ్రమకు నష్టం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రధాని నరేంద్రమోదీ ‘అబద్ధాలకు గురువు’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతి దారులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ద్వారా దేశ పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతి దారులను మోసగిస్తున్న మోదీ ప్రభుత్వం.. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని శనివారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఆరోపించారు. అమెరికా ట్రాప్‌లో పడ్డ మోదీ సర్కారు విధానాల వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి జౌళి ఉత్పత్తుల ఎగుమతులపై జీరో సుంకం ఉంటే, మన దేశ జౌళి ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా 18 శాతం దిగుమతి సుంకం విధిస్తోందని, ఇదే ప్రధాని మోదీ అబద్ధాలకు నిదర్శనమని రాహుల్ తెలిపారు. రాహుల్ ఆరోపణలను కేంద్ర మంత్రి గోయల్ తిప్పి కొట్టారు. ‘రాహుల్ వంటి నేతలను, ఆయన సారథ్యంలోని కూటమిని ప్రజలు నమ్మబోరని నా నమ్మకం. అబద్ధాలు చెప్పి మోసం చేయడం తప్ప మమ్ముల్ని విమర్శించడానికి వారికి ఏ అంశమూ లేదు’ అని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News