Share News

పుణె శివాలయంలో బాలికపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్..

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:22 AM

ఓ పదేళ్ల బాలికపై దేవాలయంలోనే లైంగిక దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తన ఇష్టదైవానికి పూజలు చేస్తున్న చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఏడవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన పుణెలోని నిగ్డీ ప్రాంతంలో ఉన్న శివాలయంలో చోటుచేసుకుంది.

పుణె శివాలయంలో బాలికపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్..
Pune Temple Incident

మహారాష్ట్ర: ఓ పదేళ్ల బాలికపై దేవాలయంలోనే అత్యాచార యత్నం తీవ్ర కలకలం రేపుతోంది. తన ఇష్టదైవానికి పూజలు చేస్తున్న చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఏడవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన పుణెలోని నిగ్డీ ప్రాంతంలో ఉన్న శివాలయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, బాలిక కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


వివరాల్లోకి వెళ్తే.. నిగ్డీలోని శివాలయానికి ఓ బాలిక ఒంటరిగా వెళ్లింది. శివుడికి పూజలు చేసి నమస్కరించింది. ఆ తర్వాత ఆలయ ద్వారం పక్కన ఉన్న కుంకుమ కోసం వెళ్లింది. బొట్టు పెట్టుకుని మళ్లీ శివలింగం వద్దకు వెళ్తోంది. అదే సమయంలో ఆలయం బయట నీటి ట్యాంకు నుంచి నీళ్లు తీసుకునేందుకు వచ్చిన నిందితుడు.. చిన్నారి ఒక్కతే ఉండటాన్ని గమనించాడు. దీంతో లోపలికి వెళ్లి బలవంతంగా ఆమెను పట్టుకున్నాడు. బాలికకు బొట్టు పెడుతున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది.


బాధిత కుటుంబ సభ్యులు వెంటనే నిగ్డీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విశాల్‌ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతను ఓ మెట్రో కాంట్రాక్టర్‌ వద్ద కూలీగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో నెట్టింట, స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏకంగా ఆలయం లోపలే ఇలాంటి చర్యలకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మమతా బెనర్జీపై హత్యాయత్నం.. టీఎంసీ ఆరోపణ

మహిళా జర్నలిస్టును రాహుల్‌ తోసేశారు

Updated Date - Oct 14 , 2026 | 07:40 AM