Share News

ప్రియాంకకు కీలక బాధ్యతలు?

ABN , Publish Date - Jun 05 , 2026 | 06:19 AM

నిర్మాణపరమైన భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్‌లో అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగతంగా...

ప్రియాంకకు కీలక బాధ్యతలు?

  • భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్‌!

  • ఏడు రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు

న్యూఢిల్లీ, జూన్‌ 4: నిర్మాణపరమైన భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్‌లో అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగతంగా పెద్దఎత్తునే మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ను ఎంపిక చేయడంతోపాటు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్‌ను నియమించడం ద్వారా ఈ విధమైన సంకేతాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇచ్చినట్టయింది. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీకి కీలక బాధ్యతలు లభిస్తాయని భావిస్తున్నారు. వయనాడ్‌ ఎంపీ అయిన తర్వాత, గత రెండేళ్లుగా ఆమెకు ఏ కీలక బాధ్యతలూ పార్టీలో ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రియాంకకు ముఖ్యమైన పదవినే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో కీలక నేత కేసీ వేణుగోపాల్‌కు కూడా ప్రధాన బాధ్యతలు లభించవచ్చున ని తెలుస్తోంది. ఏపీ కాం గ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాకూర్‌కు వేరే బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌ గతవారం సమావేశమై.. రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేసినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్‌లు, రాష్ట్రాల ఇన్‌చార్జీల మొదలు ప్రతి కీలక విభాగంలో ఈసారి మార్పులుచేర్పులు ఉండనున్నాయి. అధ్యక్షుడిగా ఖర్గే చేపట్టే చివరి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఇదే కానుంది. వచ్చే ఏడాది యూపీ, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 06:19 AM