మతం మారాలని ఒత్తిడి తేవడం వేరే మతాన్ని కించపరచడం కాదు
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:49 AM
మతం మారాలంటూ ఎవరిపైనైనా ఒత్తిడి తీసుకురావడం వేరే మతాన్ని కించపరచడం కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబై, అక్టోబరు 13: మతం మారాలంటూ ఎవరిపైనైనా ఒత్తిడి తీసుకురావడం వేరే మతాన్ని కించపరచడం కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం కేవలం మత ప్రచారం కిందికే వస్తుంది తప్ప, వేరే మతాన్ని అగౌరవపరచడం కాదని తెలిపింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ నలుగురు నిందితులపై ఓ జంట పెట్టిన కేసును కొట్టివేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. ఒకరి మతాన్ని ప్రచారం చేసుకోవడం అంటే వేరే మతంవారి మనోభావాలను దెబ్బతీసినట్టు కాదని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్కు చెందిన జస్టిస్ ఎం.డబ్ల్యూ. చంద్వానీ పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోకి మారితే ప్రతి నెలా సొమ్ము ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని, పిల్లల చదువుల ఖర్చులు భరిస్తామంటూ ఆశ చూపారని ఆ జంట ఆరోపించింది. ప్రలోభాలు పెట్టడం ద్వారా మతమార్పిడిలను నిషేధిస్తూ ఈ ఏడాది ఆగస్టులో మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాగా, 2025లో ఈ కేసు నమోదు కావడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకొంది. ఈ కేసుకు కొత్త చట్టం వర్తించదని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక