వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలి: రాష్ట్రపతి ముర్ము
ABN , Publish Date - Aug 14 , 2026 | 08:23 PM
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు దేశ ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆమె సూచించారు. రాజ్యాంగం దేశ ప్రజలకు అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి అన్నారు.
యువత తమ ప్రతిభను ఉపయోగించుకుని తమ స్వప్నాలను సాకారం చేసుకోవడంతో పాటు దేశ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో స్ఫూర్తిని నింపిన ‘వందేమాతరం’ గేయాన్ని గౌరవించాలని రాష్ట్రపతి ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన న్యాయవ్యవస్థ, చట్టసభలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
Also Read:
అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి..
రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్