ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:48 PM
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు.
ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ, సాహిత్య, వైద్య, క్రీడా తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాలను అందుకున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు కూడా పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.
తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌తో పాటు నటుడు ఆర్. మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెటర్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. దేశ అభివృద్ధికి, తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తోంది.
Also Read:
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి
నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్