Share News

యువకులకు వలపు వల.. రూ.6కోట్లు వసూలు చేసిన యువతి..!

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:57 PM

ఓ యువతి సోషల్ మీడియాలో యువకులను ఆకర్షించి కోట్లు వసూలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ హైకోర్టు న్యాయవాది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

యువకులకు వలపు వల.. రూ.6కోట్లు వసూలు చేసిన యువతి..!
Prayagraj Tinder Trap

ప్రయాగ్‌రాజ్: సోషల్ మీడియాలో యువకులను ఆకర్షించి ఓ యువతి కోట్లు వసూలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ హైకోర్టు న్యాయవాది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పల్లవి సింగ్ రాజ్‌పుత్ అనే యువతి టిండర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పురుషులతో పరిచయం పెంచుకునేదని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు.


ఆ తర్వాత వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకునేదని న్యాయవాది తెలిపారు. వారితో సన్నిహితంగా ఫొటోలు, వీడియోలు తీసుకునేదని.. అనంతరం వాటిని అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసేదని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం, హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసుల్లో ఇరికిస్తామని బెదిరించేదని చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఇప్పటివరకు రూ.6 కోట్లకు పైగా ఆమె వసూలు చేసినట్లు తెలిపారు. మరోవైపు, డబ్బులు ఇవ్వని ఐదుగురిని పలు కేసుల్లో ఆమె జైలుకు పంపిందని వెల్లడించారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునేందుకు ఆమె వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించేదని వివరించారు. ఈ వ్యవహారంలో పల్లవి సింగ్ రాజ్‌పుత్‌కు మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరించినట్లు న్యాయవాది చెప్పారు.


కాగా, పల్లవి రాజ్‌పుత్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలో మంచంపై పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు ఉండగా.. వాటి పక్కన ఆమె పడుకుని ఉంది. అలాగే, మరో ఫొటోలో చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు.. సానుకూలంగా ప్రభుత్వ రెండో దఫా చర్చలు

శిరోమణి అకాలీ దళ్ సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్‌కు మద్దతు ప్రకటిస్తూ..

Updated Date - Aug 08 , 2026 | 06:04 PM