అవిముక్తేశ్వరానందపై పోక్సో కేసు పెట్టండి
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:10 AM
బాలురను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై పోక్సో కేసు నమోదు చేయాలని శనివారం స్థానిక కోర్టు...
ప్రయాగ్‌రాజ్ కోర్టు ఆదేశం
ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 21: బాలురను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై పోక్సో కేసు నమోదు చేయాలని శనివారం స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. పోక్సో చట్టం ప్రత్యేక న్యాయస్థానం జడ్జి వినోద్ కుమార్ చౌరాసియా..ఝున్సీ పోలీసు స్టేషన్ అధికారికి ఈ ఆదేశాలు ఇచ్చారు. వారణాసిలోని విద్యా మఠం అయిదో అంతస్తులో.. ఆశ్రమంలో పనిచేసే ‘బట్కూ’ (బాలురు)లను లైంగికంగా వేధించినట్టు అశుతోష్ బ్రహ్మచారి మహరాజ్ చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయోగ్‌రాజ్‌లో నిర్వహించిన మాఘమేళాలో అవిముక్తేశ్వరానంద పవిత్ర స్నానం చేయకుండా అధికారులు అడ్డగించడం గమనార్హం. ఆయన శంకరాచార్య పదవిలో లేరని అభ్యంతరం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News