Share News

‘ధర్మస్థల’ కుట్రలో నా ప్రమేయం లేదు

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:32 AM

దక్షిణకన్నడ జిల్లాలోని ధర్మస్థల వివాదానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆరోపణలు, మాస్క్‌మ్యాన్‌ చిన్నయ్య వ్యాఖ్యలతో తనకు ఎలాంటి...

‘ధర్మస్థల’ కుట్రలో నా ప్రమేయం లేదు

బెంగళూరు, జూన్‌17(ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లాలోని ధర్మస్థల వివాదానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆరోపణలు, మాస్క్‌మ్యాన్‌ చిన్నయ్య వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలోకి అనవసరంగా తన పేరు లాగారన్నారు. ధర్మస్థల పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు కేరళ నుంచి రూ.200 కోట్లు వచ్చాయని చిన్నయ్య చెప్పారని, అందులో తన పేరును ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ధర్మస్థలకు వెళ్లలేదని, అక్కడ ఎవరినీ కలవలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంలో ఒకరైన గిరీశ్‌ మట్టణ్ణనవర్‌ తనకు ఫోన్‌ చేసి...మాస్క్‌ మ్యాన్‌ ఒకరు మాట్లాడతారని చెప్పారన్నారు. ఆ తర్వాత మాస్క్‌మ్యాన్‌ అయిన చిన్నయ్య..తాను మండ్యకు చెందిన వ్యక్తిగా చెప్పుకొన్నాడని, తమిళంలో తనతో మాట్లాడారని వివరించారు. అతడిని కలిసేందుకు తాను నిరాకరించానని, విషయం ఏమిటో వాయిస్‌ మెసేజ్‌ పంపాలని సూచించానన్నారు. ఆ మెసేజ్‌ వచ్చాక వెంటనే తాను సిట్‌ అధికారి మహంతికి ఇచ్చానని పేర్కొన్నారు. చిన్నయ్య రాష్ట్ర ప్రజలందరికీ శనగలు తినిపిస్తున్నాడని ప్రకాశ్‌రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 06:32 AM