జైల్లోనూ అదేపని
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:40 AM
పనిమనిషిపై అత్యాచారం, పలువురు మహిళలపై లైంగిక దాడుల కేసులో పరప్పన అగ్రహార జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తీరులో మార్పు రాలేదు
చెరసాల్లోనూ రేవణ్ణ అశ్లీల వీడియోలు వీక్షణ
అతడి సెల్‌ఫోన్‌లో 90 నీలి చిత్రాలు
బ్యారక్‌లోకి మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్ ఎలా వచ్చాయ్?.. విచారణ
బెంగళూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పనిమనిషిపై అత్యాచారం, పలువురు మహిళలపై లైంగిక దాడుల కేసులో పరప్పన అగ్రహార జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తీరులో మార్పు రాలేదు. జైల్లోనూ ఆయన అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు బయటపడింది. ఇటీవల ఆయన బ్యారక్‌పై సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు ఆకస్మిక దాడి అనంతరం ఈ వ్యవహారం వెలుగుచూసింది. ప్రజ్వల్ బ్యారెక్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌లో దాదాపు 90 అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. జైలులోని అతని పరుపు కింద పలువురు సినీ తారలు, మోడల్స్ అర్ధనగ్న ఫొటోలను గుర్తించినట్లు సమాచారం. బ్యారెక్‌లో లభించిన పెన్‌డ్రైవ్, మొబైల్ ఫోన్ తనవేనని ప్రజ్వల్ సహ ఖైదీ ప్రతాప్ రాయ్ అంగీకరించడంతో అగ్రహార పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జైలు గదిలో ఉండే టెలివిజన్‌కు పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేసి అశ్లీల వీడియోలు చూసినట్లు సీసీబీ పోలీసుల విచారణలో ఇద్దరూ అంగీకరించినట్లు సమాచారం. మొబైల్‌లో ఓ గేమింగ్ యాప్ నుంచి అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. సమగ్ర దర్యాప్తు కోసం ప్రజ్వల్ బ్యారెక్‌లో స్వాధీనం చేసుకున్న మొబైల్, పెన్‌డ్రైవ్, చార్జర్, నోట్‌బుక్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బ్యారక్‌లోకి సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్ ఎలా వచ్చాయనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం ప్రజ్వల్‌ను వీఐపీ బ్యారక్ నుంచి సాధారణ విభాగానికి మార్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..