Share News

ఆన్‌లైన్‌లో ప్రేమ.. ప్రియురాలి కోసం భారత్‌లోకి చొరబడ్డ పాక్ యువకుడు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:10 PM

ఆన్‌లైన్‌లో ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు భారత భూభాగంలోకి చొరబడ్డాడు. వెను వెంటనే భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.

ఆన్‌లైన్‌లో ప్రేమ.. ప్రియురాలి కోసం భారత్‌లోకి చొరబడ్డ పాక్ యువకుడు
PoK man crosses LoC

ఇంటర్‌నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు భారత భూభాగంలోకి చొరబడ్డాడు. వెను వెంటనే భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఉరీ ఏరియాలోని సిలికోట్ ప్రాంతంలో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఓ యువకుడు భారత భూభాగంలోకి ప్రవేశించడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. అతడు భారత భూభాగంలోకి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. భద్రతా దళాల విచారణలో అతడు ఏం చెప్పాడంటే..


పాక్ ఆక్రమిత కశ్మీర్, ముజఫరాబాద్‌లోని పైన్‌కడికి చెందిన జీషన్ అహ్మద్ మిర్‌కు కొన్ని నెలల క్రితం కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌కు చెందిన ఐరమ్ బానోతో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే బానోను కలవాలని జీషన్ అహ్మద్ భావించాడు. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పాక్ నుంచి భారత్‌లోకి చొరబడ్డాడు.


భద్రతా దళాలు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అదే ప్రాంతంలో ప్రియుడి కోసం వేచి ఉన్న బానోను కూడా అదుపులోకి తీసుకున్నాయి. అధికారులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ చెప్పిన వివరాలు.. కమ్యూనికేట్ అయిన విధానం ఎటువంటిదన్న దానిపై విచారణ మొదలెట్టారు.

ఇవి కూడా చదవండి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక ఆధారాలు.. బయటపడ్డ పాకిస్థాన్ బ్యాంక్ లింకు..

Updated Date - Jun 01 , 2026 | 12:28 PM