Share News

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

ABN , Publish Date - Mar 28 , 2026 | 09:15 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(శనివారం) నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం జేవర్ సమీపంలో రూ.11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఫేజ్-1 దశను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
Noida International Airport

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(శనివారం) నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం జేవర్ సమీపంలో రూ.11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఫేజ్-1 దశను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్రమంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. రోడ్డు, రైలు, మెట్రో ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానించే మల్టీ- మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు.


ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తర్వాత ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం కావడం విశేషం. ఈ విమానాశ్రయం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన నోయిడా, మీరట్, ఘజియాబాద్, మధుర, ఆగ్రాకు ప్రాథమిక అంతర్జాతీయ విమానాశ్రయంగా పని చేయనుంది. దీన్ని మొదటగా డిసెంబర్ 1, 2024న ప్రారంభించాలని నిర్ణయించగా.. వివిధ కారణాలతో దాన్ని ఏప్రిల్ 2025కు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబర్ 1, 2025కి వాయిదా పడింది. ప్రారంభోత్సవం ఇలా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది.


విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మోదీ రాక నేపథ్యంలో గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉండునున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్ విమానాశ్రయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరించనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి
జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి

పుదుచ్చేరి కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ పదవులన్నింటికీ ఏవీ సుబ్రమణియన్ రాజీనామా

Updated Date - Mar 28 , 2026 | 09:42 AM