థాంక్యూ ఫ్రెండ్స్
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:20 AM
యువత భవిత కన్నా ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి మరొకటి లేదంటూ గురువారం అర్ధరాత్రి 11.52 గంటల సమయంలో తాను విడుదల చేసిన...
తన వీడియోకి భారీగా స్పందించిన యువతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు
8 నిమిషాల్లో 25 లక్షల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్.. కొత్తగా 10 లక్షల ఫాలోయర్లు
న్యూఢిల్లీ, జూలై 24: యువత భవిత కన్నా ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి మరొకటి లేదంటూ గురువారం అర్ధరాత్రి 11.52 గంటల సమయంలో తాను విడుదల చేసిన వీడియోకి యువత నుంచి అపార స్పందన రావడం పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ ఫ్రెండ్స్’ అంటూ యువతకు కృతజ్ఞతలు చెబుతూ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక మరో వీడియో విడుదల చేశారు. యువతతో తనకున్న బంధం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి ప్రధాని వీడియో పోస్ట్ చేసిన 8నిమిషాల్లోనే 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 నిమిషాల్లోనే 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 10లక్షలకు పైగా కొత్తగా ఫాలో అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News