మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Sep 06 , 2026 | 01:40 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల కోసం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో కాకుండా మెట్రో రైలులోనే కాలేజ్‌కు వెళ్లి వచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల కోసం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో కాకుండా మెట్రో రైలులోనే కాలేజ్‌కు వెళ్లి వచ్చారు. మెట్రో ప్రయాణం సందర్భంగా చిన్న పిల్లలు, మహిళలతో ఆయన ముచ్చటించారు. ప్రధాని మోదీ తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోను మెట్రో మూమెంట్స్ శీర్షికతో ఆదివారం ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
జెన్ జీ విద్యార్థులతో మోదీ ముఖాముఖి
శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ కళాశాలకు చెందిన జెన్ జీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. యువత తమ ఆలోచనలు, ఆకాంక్షలు, భవిష్యత్ లక్ష్యాలను దేశ ప్రధానితో నేరుగా పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘మహాధర్నా’.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
వైభవ్ సూర్యవంశీని టీజ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్