Share News

అన్ని విధాలుగా అండగా ఉంటాము: నేపాల్‌ ప్రధానికి మోదీ ఫోన్

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:00 PM

ఆకస్మిక వరదలకు నేపాల్ అతలాకుతలమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంఘీభావం తెలిపారు. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఫోన్‌లో మాట్లాడారు.

అన్ని విధాలుగా అండగా ఉంటాము: నేపాల్‌ ప్రధానికి మోదీ ఫోన్
PM Modi Speaks to Balen Shah

ఇంటర్నెట్ డెస్క్: ఆకస్మిక వరదలతో నేపాల్ అతలాకుతలమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంఘీభావం తెలిపారు. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఫోన్‌లో సంఘీభావం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని రకరాల సహాయసహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎక్స్ వేదికగా ఈ విషయాలను ప్రధాని వెల్లడించారు. భారత్ నేపాల్‌కు అన్నిరకాలుగా అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే భారత సహాయక బృందాలు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు.


మరోవైపు, నేపాల్‌కు మానవతాసాయం పంపించేందుకు కూడా సిద్ధమవుతున్నామని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఔషధాలు, రేషన్ సామాన్లను నేపాల్‌కు పంపించనున్నట్టు చెప్పారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు చెందిన బృందాలను కూడా నేపాల్‌కు పంపించే యోచనలో ఉన్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రసువా జిల్లాలోని భోటే కోశీ నదిలో అకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో 22 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో 400 మంది గల్లంతయ్యారు. 105 మంది భారతీయులు కూడా ఈ వరదల్లో గల్లంతైనట్టు తెలుస్తోంది. మరోవైపు, అక్కడి భారతీయుల సహాయార్థం నేపాల్‌లోని ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ నెంబర్లను ప్రకటించింది. +977 985 131 6807, +977 970 910 7500 నెంబర్లపై తమను సంప్రదించవచ్చని చెప్పింది.


ఈ వార్తలనూ చదవండి:

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 1000 మంది గల్లంతు..

మోదీ వ్యతిరేక ర్యాలీ పెట్టుకోండి.. న్యూయార్క్ మేయర్‌పై అమెరికన్ సింగర్ ఫైర్..

Updated Date - Aug 26 , 2026 | 06:08 PM