Share News

హైఫైవ్‌లు ఇస్తూ.. నవ్వులు చిందిస్తూ..

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:12 AM

ప్రధానఇ మోదీ రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేశం నలుమూలల నుంచి న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన విద్యార్థినులతో...

హైఫైవ్‌లు ఇస్తూ.. నవ్వులు చిందిస్తూ..

  • ప్రధాని రాఖీ వేడుకలు

  • మోదీకి రాఖీలు కట్టిన విద్యార్థినులు

  • రాఖీ కట్టిన వారిలో తెలుగు బాలిక మధుమిత

న్యూఢిల్లీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధానఇ మోదీ రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేశం నలుమూలల నుంచి న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన విద్యార్థినులతో మోదీ రక్షాబంధన్‌ వేడుకలు చేసుకున్నారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకుంటూ, హైఫైవ్‌లు ఇస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ఆ పిల్లలు చెప్పిన కవితలు వింటూ కోలాహలంగా గడిపారు. ఢిల్లీ ప్రసాద్‌ నగర్‌లోని ‘ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ’ డాక్టర్‌ బి.వి. నాథ్‌ అండ్‌ టి.ఆర్‌. రావు మెమోరియల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ 12వ తరగతి విద్యార్థిని, తెలుగు అమ్మాయి సాయి మధుమిత కూడా ఈ వేడుకల్లో ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. ఈ వేడుకలకు ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఎంపికవ్వగా.. వారిలో సాయి మధుమిత ఒక్కరే తెలుగు అమ్మాయి కావడం విశేషం. 2026-27 విద్యా సంవత్సరంలో సైన్స్‌ విభాగంలో ప్రతిభ కనబరిచిన మధుమిత ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రధాని మోదీకి రాఖీ కట్టే అవకాశం లభించడం తన జీవితంలో మర్చిపోలేనని మధుమిత ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 06:58 AM