Share News

ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి.. సాయుధ దళాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

ABN , Publish Date - May 07 , 2026 | 10:42 AM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. 2025, మే 7వ తేదీన భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. నేటితో (గురువారం) ఆపరేషన్ సిందూర్‌‌కు ఏడాది పూర్తయింది.

ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి.. సాయుధ దళాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
Operation Sindoor anniversary

న్యూఢిల్లీ, మే 7: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. 2025, మే 7వ తేదీన భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి.100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయారు. నేటితో (గురువారం) ఆపరేషన్ సిందూర్‌‌కు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్‌ ఖాతాకు సంబంధించిన డీపీని మార్చారు. ఆపరేషన్ సిందూర్ ఫొటో పెట్టారు.


సాయుధ దళాలపై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఏడాది క్రితం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన సాయుధ దళాలు అసమానమైన ధైర్యసాహసాలను ప్రదర్శించాయి. పహల్గామ్‌లో అమాయక భారతీయులపై దాడికి తెగబడ్డ వారికి తగిన విధంగా సమాధానం చెప్పాయి. మన దళాల పరాక్రమానికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన స్పందనను, జాతీయ భద్రతను కాపాడటంలో ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబించింది’..


‘ఇది మన సాయుధ దళాల వృత్తి నైపుణ్యం, సంసిద్ధత, సమన్వయ శక్తిని కూడా చాటిచెప్పింది. అదే సమయంలో.. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం భారతదేశం చేస్తున్న కృషి.. జాతీయ భద్రతకు చేకూర్చిన బలాన్ని ఆపరేషన్ సిందూర్ నొక్కి చెప్పింది. సంవత్సరం తర్వాత కూడా.. ఉగ్రవాదాన్ని ఓడించడానికి, దానికి ఊతమిచ్చే వ్యవస్థను నిర్మూలించడానికి మేము అంతే స్థిరమైన సంకల్పంతో ఉన్నాము’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

మోదీ నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణ..

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ప్రకటన..

Updated Date - May 07 , 2026 | 10:49 AM