Share News

కేరళ పర్యటన.. పిల్లాడికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:48 PM

ప్రధాని మోదీ స్పీచ్ సందర్భంగా మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ పిల్లాడి ప్రేమకు మోదీ ఫిదా అయ్యారు. అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

కేరళ పర్యటన.. పిల్లాడికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రధాని మోదీ
Prime Minister Narendra Modi

తిరువనంతపురం, జనవరి 23: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. శుక్రవారం తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ స్పీచ్ సందర్భంగా మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ పిల్లాడి ప్రేమకు మోదీ ఫిదా అయ్యారు. అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా ఓ పిల్లాడు ఆయన స్కెచ్‌‌ను పట్టుకుని నిలబడి ఉన్నాడు.


ఆ పిల్లాడు చాలా సేపటినుంచి అలానే నిలబడి ఉండటంతో మోదీ చలించిపోయారు. తన ప్రసంగాన్ని ఆపేశారు. ‘ఆ పిల్లాడు చాలా సేపటి నుంచి స్కెచ్ గాల్లోకి ఎత్తి పట్టుకుని నిలబడి ఉండటం చూస్తూ ఉన్నాను. అంతసేపు నిల్చుంటే అలసిపోతావు. ఆ స్కెచ్‌ను నాకు ఇవ్వు. స్కెచ్ వెనకాలి వైపు నీ అడ్రస్ రాసి ఇవ్వు. నేను నీకు లేఖ రాస్తాను. ఎస్పీజీ సిబ్బంది ఆ పిల్లాడి ప్రేమను అతి జాగ్రత్తగా తీసుకొచ్చి నాకు ఇవ్వాలని కోరుతున్నాను’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

రైళ్లలో టాయిలెట్ల కోసం ఓ వ్యక్తి లెటర్.. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

పేలుతున్న పాత టీవీలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

Updated Date - Jan 23 , 2026 | 04:08 PM