Share News

ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:46 PM

దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ, వాతావరణ సదస్సు ప్రారంభమైంది. ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు.

ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు.. ప్రారంభించిన ప్రధాని మోదీ..
PM Modi environment conference

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ, వాతావరణ సదస్సు ప్రారంభమైంది. 'ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్' పేరుతో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ఈ సదస్సును జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్‌జీటీ) సెప్టెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహిస్తోంది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్‌తో పాటు 17 దేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు పాల్గొంటున్నారు (PM Modi environment conference).


ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. 'పీఎం సూర్యఘర్' పథకం విజయవంతమైందని, 50 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటయ్యాయని అన్నారు. ఆధునిక వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోందన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు భారత్‌లోనే ఉందని పేర్కొన్నారు. ఇక, భారత్‌లో ఈవీ విప్లవం రావాల్సి ఉందని అన్నారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను అనవసరంగా నిందిస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాల తలసరి కర్బన ఉద్గారాలు భారత్‌తో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని మోదీ చెప్పారు (International environment conference 2026).


ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పర్యావరణ, వాతావరణ సవాళ్లపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు (Climate dynamics). పర్యావరణ విధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో ఉన్న లోపాలను గుర్తించడంతో పాటు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు, ఉత్తమ పద్ధతులపై అనుభవాలను పంచుకోనున్నారు. వాతావరణ న్యాయం, జీవవైవిధ్యం, పర్యావరణ చట్టాలు, పునరుత్పాదక ఇంధనం, అడవుల పరిరక్షణ, పర్యావరణ పరిపాలన వంటి అంశాలపై సదస్సులో సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

బిల్లుపై సంతకం పెట్టిన ట్రంప్.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు మార్గం సుగమం..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 19 , 2026 | 01:46 PM