హెచ్-1బీ వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం.. మరో ఏడాది పాటు లక్ష డాలర్ల ఫీజు..
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:52 PM
హెచ్-1బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసాకు సంబంధించిన లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏడాది పాటు పొడిగించారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసాకు సంబంధించిన లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏడాది పాటు పొడిగించారు. 2025లో తీసుకొచ్చిన ఈ నిబంధన ఈ నెలలో ముగియాల్సి ఉంది. తాజాగా దీనిని 2027 సెప్టెంబర్ 21 వరకు పొడిగించారు (H-1B visa fee 2026).
విదేశీ ఉద్యోగులను హెచ్-1బీ కేటగిరీ కింద అమెరికాలోకి తీసుకురావాలంటే వారి పిటిషన్‌తో పాటు లక్ష డాలర్ల చెల్లింపు అవసరమయ్యేలా ట్రంప్ 2025 సెప్టెంబర్‌లో నిబంధన తీసుకొచ్చారు. ఏడాది పాటు ఈ నిబంధన అమల్లో ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. అయితే తాజాగా ఆ నిబంధనను మరో ఏడాది పాటు పొడిగించారు. 2025లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఇస్తున్న కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది ($100000 H-1B fee).
హెచ్-1బీ కార్యక్రమంలో కొన్ని సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ట్రంప్ వర్గం ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది. అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ చాలా సంస్థలు ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణలు చేస్తోంది. దీంతోనే ఈ నిబంధనను ట్రంప్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది (Trump H-1B visa).
హెచ్-1బీ వీసాలపై భారతీయ సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో ఆధారపడ్డారు (H-1B visa India). ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో అమెరికాలో ఉద్యోగాల కోసం ఈ వీసా కీలకంగా ఉంది. ఈ లక్ష డాలర్ల ఫీజు నిబంధన భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. కాగా, అమెరికాలో ఇప్పటికే ఉన్న హెచ్-1బీ ఉద్యోగుల రెన్యువల్స్‌కు ఈ లక్ష డాలర్ల చెల్లింపు వర్తించదు.
ఇవి కూడా చదవండి..
బిల్లుపై సంతకం పెట్టిన ట్రంప్.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు మార్గం సుగమం..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..