Share News

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు..

ABN , Publish Date - Jul 04 , 2026 | 09:27 PM

250వ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడితో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం..  ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు..
US Independence Day

ఇంటర్‌నెట్ డెస్క్: 250వ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడితో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే 250 సంవత్సరాలు అమెరికాకు మరింత గొప్ప శ్రేయస్సు, శాంతి, పురోగతిని తీసుకురావాలని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘అమెరికా చరిత్రాత్మక 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు, అమెరికా ప్రజలకు.. 140 కోట్ల మంది భారతీయుల తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’..


‘భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మించిన బంధం ఉంది. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలనపై ఉన్న ఉమ్మడి నమ్మకం, ప్రజల అపరిమితమైన సామర్థ్యాలు.. రెండు దేశాల మధ్య స్నేహాన్ని ప్రపంచ శ్రేయస్సుకు ఒక శక్తిగా మారుస్తున్నాయి. రాబోయే 250 సంవత్సరాలు అమెరికాకు మరింత గొప్ప శ్రేయస్సు, శాంతి, పురోగతిని తీసుకురావాలని.. అలాగే భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌తో రెండో టీ20.. ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు ఎంతంటే..

ఏపీలో 51 పట్టణాలకు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం

Updated Date - Jul 04 , 2026 | 09:42 PM