ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్.. ఆ దాడులను ఖండించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:52 PM
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతోంది.
న్యూఢిల్లీ, మార్చి 21: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 22వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతోంది. అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. చమురు, గ్యాస్ కొరతతో ఇండియాలో కూడా సంక్షోభం నెలకొంది.
ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఇరాన్‌లోని మౌలిక స్థావరాలపై దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మౌలిక సదుపాయాలపై దాడులు చేయటం వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బ తింటుందని, వరల్డ్ సప్లై చైన్‌కు ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ఆ దేశం తీసుకుంటున్న చర్యలను మోదీ ప్రశంసించారు. యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
యుద్ధం ఆపే ఆలోచనలో ట్రంప్..
యుద్ధం కారణంగా అగ్రరాజ్యం అమెరికా అర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. దీనికి తోడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాకు ఎదురవుతున్న ఆటంకాలు సంక్షోభం స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఓ కీలక పోస్ట్ పెట్టారు. అమెరికా తన లక్ష్యాలకు చేరువ అయ్యిందని, మిలటరీ చర్యలకు ముగింపు పలికే ఆలోచనలో ఉన్నామని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డెయిరీ, పశుసంవర్ధక ఫారాలకు భారీ ఊరట
ఏపీ వాసులకు అలర్ట్.. మరో 3 గంటల్లో భారీ వర్ష సూచన