ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు వేగవంతం కావాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:17 AM
ప్రస్తుత ప్రపంచంలో పౌరులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వేగవంతమైన, రియల్-టైమ్ పరిష్కారాలను కోరుకుంటున్నారని, దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ కార్యాల యాల్లో సంప్రదాయ సేవా విధానాల్లో వేగం పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఏఐ యుగంలో పౌరులు తక్షణ
పరిష్కారాలు కోరుకుంటున్నారు: మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 1: ప్రస్తుత ప్రపంచంలో పౌరులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వేగవంతమైన, రియల్-టైమ్ పరిష్కారాలను కోరుకుంటున్నారని, దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ కార్యాల యాల్లో సంప్రదాయ సేవా విధానాల్లో వేగం పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇందుకుగాను నియామకాల దశలోనే మౌలిక మార్పు అవసరమని నొక్కి చెప్పారు. ఇదోక ప్రభుత్వ ఉద్యోగం అనే భావనకే పరిమితం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే అంతర్లీన ప్రేరణ ఉండేలా అభ్యర్థుల ఎంపిక విధానాన్ని సంస్కరించాలని చెప్పారు. 2025 అక్టోబరు 1న ప్రారంభమైన యూపీఎ్‌ససీ శతాబ్ది వేడుకలు ఏడాది పొడవున కొనసాగి గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఒక స్మారక నాణేన్ని, స్మారక స్టాంపును ప్రధాని విడుదల చేశారు. ‘100 లాండ్‌మార్క్ జడ్జిమెంట్స్: షేపింగ్ ది పాలసీస్ ఆఫ్ యూపీఎ్‌ససీ ఇన్ ఇండియా’ అనే పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పౌరుల సేవకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే 21వ శతాబ్దపు పరిపాలనలో అత్యంత కీలకమైన అంశమని నొక్కి చెప్పారు. ‘పౌరుడే దేవుడు. పౌరుల సేవే మనకు సర్వోన్నతమైనది. మనం ఎప్పుడూ రెండు ప్రామాణిక సూత్రాలను గుర్తుంచుకోవాలి. 1. దేశమే ఫస్ట్. 2. పౌరుడే ఫస్ట్’ అన్నారు. కేవలం విద్యా పరిజ్ఞానం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు