కాంగ్రెస్ వల్లే ప్రమాదంలో దేశభద్రత
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:32 AM
దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు, భయం, అభద్రతాభావంతో దేశ భద్రత ప్రమాదంలో పడిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా...
అస్సాంలో చొరబాట్లకు ఆ పార్టీయే కారణం.. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది
గువాహటి సభలో ప్రధాని నరేంద్రమోదీ
గువాహటి, ఫిబ్రవరి 14: దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు, భయం, అభద్రతాభావంతో దేశ భద్రత ప్రమాదంలో పడిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలోకి పొరుగు దేశాల నుంచి చొరబాట్లను ఆ పార్టీ ప్రోత్సహించిందని ఆరోపించారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. రోజంతా సాగిన ఈ పర్యటనలో దాదాపు రూ.5,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలోనే తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్‌ఎ్‌ఫ)ను ప్రారంభించారు. మోదీ ప్రయాణించిన సీ-130జే విమానం నేరుగా ఆ రన్‌వే పైనే దిగటం విశేషం. అనంతరం గువాహటిలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ‘ముస్లింలీగ్ వల్ల నాడు దేశవిభజన జరిగింది. కానీ నేడు ఎంఎంసీ (మావోయిస్టు, ముస్లిం, కాంగ్రె్‌స)లు తయారయ్యాయి. వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడుతోంది. బీజేపీ మాత్రం అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ఉంది. అస్సాంకు వచ్చే ఐదేళ్లు చాలా ముఖ్యమైన సమయం. కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పటికంటే గత పదేళ్లుగా అధికారం లేకపోవటం వల్ల మరింత ప్రమాదకరంగా మారింది’ అని ఆరోపించారు. కాగా, అస్సాం వరకు వచ్చిన ప్రధాని మోదీ.. 2023 నుంచి జాతుల ఘర్షణతో నలిగిపోతున్న మణిపూర్‌లో కూడా పర్యటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
బ్రహ్మపుత్రపై వంతెన
గువాహటిని, ఉత్తర గువాహటిని కలుపుతూ రూ.3,030 కోట్లతో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఆరు వరుసల వంతెనను ప్రధాని శనివారం ప్రారంభించారు. వంతెనపై కాసేపు నడిచారు. దీనిని కుమార్ భాస్కర్ వర్మ సేతు అని పిలుస్తున్నారు. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి ఎక్స్‌ట్రాడోస్డ్ ప్రెస్ స్ర్టెస్డ్ కాంక్రీట్ (పీఎ్‌ససీ) వంతెన. ఈ రకం వంతెనలను బలమైన ఉక్కు తీగలతో బిగించి భూకంపాలను తట్టుకొనేలా నిర్మిస్తారు. గువాహటిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను కూడా ప్రధాని ప్రారంభించారు.
హైవేపై రన్‌వే
ఇటు బంగ్లాదేశ్ నుంచి అటు చైనా నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారత్ ఓ చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనే తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్‌ఎ్‌ఫ)ని ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలోని మోరన్‌లో శనివారం ప్రారంభించారు. వాయుసేనకు చెందిన సీ130జే విమానంలో ఆయన స్వయంగా ఆ ఈఎల్‌ఎ్‌ఫపై దిగారు. దీనిని 37వ (ఎన్‌హెచ్ 127) నంబర్ జాతీయ రహదారిపై మోరన్ బైపా్‌సలో నిర్మించారు. సాధారణ సమయంలో ఇది హైవేగా ఉపయోగపడుతుంది. అత్యవసర సమయంలో రన్‌వేగా వాడుకుంటారు. ఇది చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు వాయుసేన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, సరుకు రవాణా విమానాలు అత్యవసరంగా దిగేందుకు దీనిని వాడుకుంటారు. ప్రధాని ప్రారంభించిన తర్వాత వాయుసేనకు చెందిన రఫేల్, సుఖోయ్, తేజస్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇక్కడ విన్యాసాలు నిర్వహించాయి. రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్ట్రెచ్ 4.2 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిని సివిల్, మిలిటరీ అవసరాల కోసం వినియోగించుకొనేలా నిర్మించారు. 40 టన్నుల యుద్ధ విమానాలు, 74 టన్నుల రవాణా విమానాలు ఈ రన్‌వేపై తేలిగ్గా టేకాఫ్ కాగలవు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News