పెంగ్విన్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:44 AM
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకం ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పబ్లిష్ కాకుండానే సోషల్ మీడియాలో బయటకు...
పెంగ్విన్‌గానీ లేదా నరవణేగానీ అబద్ధం చెబుతున్నారన్న రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకం ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పబ్లిష్ కాకుండానే సోషల్ మీడియాలో బయటకు రావడంపై ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసు జారీ చేశారు. ఈ పుస్తకం అనధికారికంగా బయటకు రావడంపై పలు ఆరోపణలు వస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై పెంగ్విన్‌కు పలు ప్రశ్నలతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నోటీసు జారీ చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా ఈ విషయమై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మంగళవారం మాట్లాడుతూ.. నరవణే పుస్తకం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అటు పెంగ్విన్‌గానీ ఇటు నరవణే గానీ అబద్ధం చెబుతుండవచ్చని పేర్కొన్నారు. అయితే నరవణే అబద్ధం చెబుతారని తాను అనుకోనని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News