Share News

పాట్నాలో ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్

ABN , Publish Date - May 08 , 2026 | 02:37 PM

ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ ఆశావాహులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వారిపై లాఠీచార్జ్ జరిపారు.

పాట్నాలో ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్

పాట్నా, మే 08: ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ ఆశావాహులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వారిపై లాఠీచార్జ్ జరిపారు. ఈ ఘటన బిహార్‌ రాజధాని పాట్నాలో శుక్రవారం చోటు చేసుకుంది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) టీచర్స్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆశావాహులు బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.


ఒకానొక సమయంలో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు బిహార్‌లో సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఇటీవల కొలువుదీరింది. ఆయన కేబినెట్‌ ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ఆ మరునాడే టీచర్ల పరీక్షల కోసం నోటిపికేషన్ విడుదల చేయాలంటూ ఆశావాహులు ఆందోళనకు దిగారు.

Updated Date - May 08 , 2026 | 03:02 PM