పాస్‌పోర్ట్.. విదేశీ ప్రయాణ క్రమబద్ధీకరణ పత్రం
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:05 AM
పాస్‌పోర్ట్ అంటే భారత పౌరులు చేసే విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసే ధ్రువపత్రమని...
విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన
న్యూఢిల్లీ, జూలై 14: పాస్‌పోర్ట్ అంటే భారత పౌరులు చేసే విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసే ధ్రువపత్రమని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ అంటే ప్రయాణ ధ్రువపత్రమే తప్ప, భారత పౌరసత్వాన్ని ధ్రువీకరించే పత్రం కాదని గతంలో చేసిన ప్రకటనపై వివాదం తలెత్తడంతో ఈ వివరణ ఇచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మంగళవారం వివరణ ఇస్తూ ఇది కేవలం విదేశీ ప్రయాణాలను క్రమబద్ధం చేసే పత్రమని తెలిపారు. ‘‘భారత పౌరులకు, ఇతర వ్యక్తులకు పాస్‌పోర్టులు జారీ చేయడం పాస్‌పోర్ట్ చట్టం-1967, పాస్‌పోర్ట్ రూల్స్-1980కి అనుగుణంగా జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 8ు పౌరులకే పాస్‌పోర్టులు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..
జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం