కీలకబిల్లుల ఆమోదానికి పార్లమెంట్ ప్రత్యేక భేటీ!
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:36 AM
కీలకమైన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్ మళ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ వర్షాకాల సెషన్‌లోనే ప్రత్యేక భేటీ..
వర్షాకాల సెషన్ ప్రోరోగ్ కాకపోవడంతో ఇంకా అవకాశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: కీలకమైన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్ మళ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ వర్షాకాల సెషన్‌లోనే ప్రత్యేక భేటీ నిర్వహించే అవకాశాలు ఇంకా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ కాకపోవడమే దానికి కారణమని పేర్కొన్నాయి. ప్రత్యేక సమావేశం వద్దని ప్రభుత్వం భావిస్తేనే ప్రోరోగ్ చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. బ్రిక్స్ సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించాయి. ఒకవేళ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావిస్తే అది శరన్నవరాత్రుల సమయంలో ఉండొచ్చని, మహిళా శక్తికి సంకేతంగా భావించే దుర్గా పూజ సమయంలో మహిళా బిల్లు ఆమోదించవచ్చని ఆ వర్గాలు అంచనా వేశాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టగా, ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుకు కావాల్సిన మూడింట రెండొంతుల మోజారిటీ పొందలేకపోయిన విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి లోక్‌సభలో 360మంది, రాజ్యసభలో 164 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆ నంబర్లకు చేరువైంది. పశ్చిమబెంగాల్లో అధికారం చేపట్టి బీజేపీ బలపడింది. అలాగే డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం