సీఈసీపై అభిశంసన!
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:25 AM
ప్రత్యేక, సమగ్ర ఓటరు జాబితా (సర్) ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు భారత ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది...
‘సర్’ నేపథ్యంలో విపక్షాల యోచన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : ప్రత్యేక, సమగ్ర ఓటరు జాబితా (సర్) ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు భారత ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇప్పటికే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సంబంధాలు రానున్న కాలంలో మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రెండో దశ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మార్చిలో ప్రారంభం అవుతాయి. ఆ సెషన్‌లోనే సీఈసీకి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం తేనున్నట్టు తెలిసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినా, ‘ఇండియా కూటమి’లోని మిగతా పార్టీలు దీనిపై ఇప్పటివరకు దూరంగానే ఉన్నాయి. అధికార పక్షం వైపే మొగ్గుతున్నారంటూ స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుపై తృణమూల్ సంతకం చేయలేదు. దీంతో తృణమూల్ పట్ల మిగతా విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. తృణమూల్‌ను తమ వైపు తెచ్చుకోవడంతోపాటు ఎన్నికల కమిషన్ పట్ల స్వతహాగానే ఉన్న వ్యతిరేకత రీత్యా కూడా.. సీఈసీని అభిశంసించాలన్న మమత ప్రతిపాదన వైపే విపక్షాలు మొగ్గే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు సానుకూల సంకేతాలు అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News