సీఈసీ తొలగింపునకు రాజ్యసభలో విపక్షాల తాజా నోటీసు
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:53 AM
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు మరోసారి రాజ్యసభలో నోటీసు సమర్పించాయి. ఎన్నికల...
73 మంది ఎంపీల సంతకాలతో అందజేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు మరోసారి రాజ్యసభలో నోటీసు సమర్పించాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో సీఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తాజా నోటీసు అందజేశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18న ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విపక్షాలు ఈ నోటీసులో తీవ్రంగా ఆక్షేపించాయి. సీఈసీ ఇప్పటివరకు ఎటువంటి షోకాజ్ నోటీసులు గానీ, కనీసం బహిరంగ వివరణ గానీ ఇవ్వకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ సమర్పించిన ఈ నోటీసుపై కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (శరద్‌పవార్), ఆర్డేడీ వంటి పార్టీలకు చెందిన 73 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేశారు. ఇలాంటి నోటీసులకు 50మంది సభ్యుల మద్దతు సరిపోతుంది. సీఈసీ తొలగింపుపై సమర్పించిన తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఇటీవల తిరస్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News