అమిత్‌షాను సభకు రమ్మనండి!
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:00 AM
జంతర్‌మంతర్‌లో సీజేపీ నిరసనల సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జి విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ రాజ్యసభలో...
ప్రతిపక్షాల వినతిని పరిగణనలోకి తీసుకోండి
కేంద్ర మంత్రి రిజిజుకు రాజ్యసభ చైర్మన్ సూచన
న్యూఢిల్లీ, ఆగస్టు 6: జంతర్‌మంతర్‌లో సీజేపీ నిరసనల సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జి విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ రాజ్యసభలో పునరుద్ఘాటించింది. సభ నడవకుండా గురువారం కూడా అడ్డుకుంది. కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి.. ‘అమిత్‌షా జవాబ్ దో.. సదన్ మే ఆవో..’ అని నినదించారు. దీంతో షా సభకు రావాలన్న వినతిని పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతిపక్షాల మనోభావాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజుజుకు సుతిమెత్తగా సూచించారు. ఈ వ్యవహారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ సభ సజావుగా సాగడం లేదు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిరోజూ అమిత్‌షా సభకు వచ్చి తమ ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గురువారం కూడా ఇదే జరిగింది. ప్రత్యేక ప్రస్తావనల తర్వాత ఖర్గే మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. రోజు మొత్తంలో నాలుగు సార్లు వాయిదావేసినా ఫలితం లేకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News