Share News

మమతతో భేటీకి 8 మంది ఎమ్మెల్యేలే హాజరు!

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:12 AM

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కోల్‌కతా కాళీఘాట్‌లోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో...

మమతతో భేటీకి 8 మంది ఎమ్మెల్యేలే హాజరు!

కోల్‌కతా, జూన్‌ 5: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కోల్‌కతా కాళీఘాట్‌లోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఇక లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీల్లో నలుగురు, 13 మంది రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు (డెరిక్‌ ఒబ్రియాన్‌, డోలా సేన్‌) మాత్రమే సమావేశానికి రావడం ఆ పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనంగా చెబుతున్నారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీల్లో మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కూడా ఉన్నారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికైన రుతవ్రత శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల నాటికి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా అసమ్మతి వర్గంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 05:12 AM