Share News

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు లొంగుబాటు

ABN , Publish Date - Mar 24 , 2026 | 08:35 PM

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు ఒడిశాలోని కొందమాల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారంనాడు లొంగిపోయారు. మరో నలుగురు మావోయిస్టు సభ్యులతో కలిసి శుక్రు లొంగిపోయినట్టు డీజీపీ వైబి ఖురానియా తెలిపారు.

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు లొంగుబాటు
Most wanted Maoist Sukru

భువనేశ్వర్: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు (Sukru) ఒడిశాలోని కొందమాల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారంనాడు లొంగిపోయారు. మరో నలుగురు మావోయిస్టు సభ్యులతో కలిసి శుక్రు లొంగిపోయినట్టు డీజీపీ వైబి ఖురానియా తెలిపారు. సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ సభ్యుడైన శుక్రు ఏకే-47 రైఫిల్‌తో లొంగిపోయినట్టు చెప్పారు. శుక్రుపై రూ.55 లక్షల రివార్డు కూడా ఉంది.


మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన శుక్రు కేకేబీఎన్ డివిజన్‌ పేరిట కొత్తగా దళాన్ని ఏర్పాటు చేసి కొందమాల్ జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు చురుకుగా నిర్వహంచే వారు. మార్చి 31వ తేదీలోగా తక్కిన మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం గడువు విధించింది. ఈ క్రమంలో కొందమాల్, రాయగఢ, కలహండి జిల్లాల ట్రై-జంక్షన్ వద్ద నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌ను స్పెషల్ ఆర్గనేజేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), సీఆర్‌పీఎఫ్, జిల్లా వాలంటరీ ఫోర్స్, బీఎస్‌ఎస్ ముమ్మరం చేశాయి.


ఇవి కూడా చదవండి..

కోవిడ్ విషాదాలను మోదీ మరచిపోయారా... రాహుల్ గాంధీ

హరీశ్ రాణా మృతి.. దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా..

Updated Date - Mar 24 , 2026 | 08:36 PM